లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ ఇంజనీర్

గోల్డెన్ న్యూస్ / మహబూబ్‌నగర్ :  ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిర్మూలనకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) కట్టుదిట్టంగా చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా, భూ నియంత్రణ పథకం (LRS) సంబంధిత సేవలను అందించేందుకు లంచం డిమాండ్ చేసిన ఒక ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా, మొదటి వలయంలోని డివిజన్-1, సబ్ డివిజన్-1 కు చెందిన నీటిపారుదల శాఖ సహాయక కార్యనిర్వాహక ఇంజనీరు మహమ్మద్ ఫయాజ్  ఫిర్యాదుదారుని నుండి రూ.3,000/-ను లంచంగా స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

ఈ మొత్తం లంచాన్ని, భూ నియంత్రణ పథకం (ఎల్.ఆర్.ఎస్) అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదుదారుని ప్లాట్‌కు సంబందించిన సంయుక్త తనిఖీ నివేదిక (Joint Inspection Report) మరియు ఎన్.ఓ.సి (NOC) పొందుపరిచేందుకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram