అయోధ్య చారి మృతి బాధాకరం. తుమ్మల              

గోల్డెన్ న్యూస్ / సత్తుపల్లి : సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు బొల్లోజు అయోధ్య చారి  ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని తుమ్మల అన్నారు.పినపాక నియోజకవర్గం మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అయోధ్య  చేసిన సేవలు మరువలేనివి వారి మృతి సిపిఐ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటు నాలుగు దశాబ్దాల పాటు ప్రజాహక్కుల కొరకు అలుపెరగని పోరాటాలు చేసిన అయోధ్య  ఇక లేరు అన్న విషయం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram