గుబ్బ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్ని ప్రమాదం

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్‌ పరిధిలోని అన్నారం శివారులోని గుబ్బ కోల్డ్‌ స్టోరేజ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో స్థానికులు, కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. జీడిమెట్ల, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వచ్చినఈ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు రాత్రంతా శ్రమించారు.

ప్రమాదంలో కోల్డ్‌ స్టోరేజీలోని వివిధ పరిశ్రమలకు చెందిన ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలు కాలిపోయాయి. పలు ఫార్మా పరిశ్రమల ఉత్పత్తులు సైతం కాలిబూడిదైనట్లు ప్రాథమికంగా తెలిసింది. మంటలు రాత్రి 10గంటల వరకూ అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమ వర్గాలు, అధికారులు మరో 6 అగ్నిమాపక వాహనాలు తెప్పించారు.

 

మొత్తం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు తెచ్చేందుకు రాత్రంతా శ్రమించారు. ఎస్సై లక్ష్మీపతిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలియలేదు. ప్రమాదం పూర్తి వివరాలు నేడు తెలిసే అవకాశం ఉంది

.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram