బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కామ్రేడ్ అయోధ్య
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా)
మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి,
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కామ్రేడ్ బొల్లోజు. అయోధ్య గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం సిపిఐ పార్టీ కే కాక ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజలకు తీరని లోటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం రామానుజవరం అయోధ్య గారి స్వగృహంలో వారి పార్థివ దేహాన్ని సందర్శించి,పూలమాలవేసి, నివాళులర్పించి, సంతాపం ప్రకటించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రజలకు అండగా నిలబడిన వాడు కామ్రేడ్ అయోధ్య గారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుగా ప్రజలకు గుర్తుకు వచ్చేది కామ్రేడ్ అయోధ్య గారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కమ్యూనిస్టు ఉద్యమానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో కమ్యూనిస్టు ఉద్యమానికి నిట్టాడిలా నిలబడిన ఎర్రజెండా ముద్దుబిడ్డ కామ్రేడ్ అయోధ్య గారు. ఈ ప్రాంత కమ్యూనిస్టు పార్టీలకు పెద్దన్నగా నిలబడినవాడు కామ్రేడ్ అయోధ్య గారు అని అన్నారు. ఎవరైనా తనకోసం, తన కుటుంబం కోసం పని చేసి మరణించడం సహజమైనది. జీవితాంతం ప్రజల కోసం పనిచేసి మరణించడం గొప్ప విషయం. జీవితాంతం ప్రజల కోసం పని చేసినవాడు కామ్రేడ్ అయోధ్య గారు అన్నారు. కామ్రేడ్ అయోధ్య గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరం అన్నారు. అయోధ్య గారి మరణం ఎంతగానో కలచివేసింది అన్నారు.
సంతాపం తెలిపిన వారిలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) నాయకులు శెట్టిపల్లి.నాగేశ్వరరావు, కురసం. రామకృష్ణ, అలవాల. సమ్మన్న, ఎండి. యాకూబ్ అలీ, పి. సంజీవరెడ్డి, రాజకుమార్, వంశీ తదితరులు ఉన్నారు.