కొత్త మార్కెట్ యార్డులు ఇవే..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు, పెద్దకొత్తపల్లి. – వనపర్తి జిల్లాలోని పానగల్, వీవనగండ్ల, ఖిలాఘన్‌పూర్, గోపాల్‌పేట. – పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు. – హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి. – నల్గొండ జిల్లాలోని దామరచర్ల. – ఖమ్మం జిల్లాలోని మత్కేపల్లి..
కాగా, కొత్త మార్కెట్ యార్డుల ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు కలుగనున్నాయి. మార్కెట్ యార్డులు రైతులకు తమ పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయించుకోవచ్చు. దీని వల్ల దళారుల బెడద తగ్గిపోతుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ఆశించినంత ధరలు, ఎక్కువ లాభాలు పొందవచ్చు. యార్డులలో పోటీ వాతావరణం నెలకొని, రైతులకు మంచి రేట్లు లభిస్తాయి. మార్కెట్ యార్డుల్లో జరిగే లావాదేవీలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయి. పంటల తూకం, నాణ్యత పరీక్షలు, ధరల నిర్ణయం వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయి. దీనివల్ల మోసాలు, అన్యాయాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి.