అభిమానుల ఆధ్వర్యంలో మణుగూరులో ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు – రక్తదాన శిబిరం మరియు శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి రోగులకు పండ్లు పంపిణీ
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : ప్రిన్స్ మహేష్ బాబు యాభోయవ పుట్టినరోజు సందర్భంగా మణుగూరు మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శనివారం నాడు మణుగూరులో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమాన కథానాయకుని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు తొలుత యువకులు ప్రభుత్వ వంద పడగల ఆసుపత్రిలో ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ కు రక్తం దానం చేశారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదే స్ఫూర్తితో సీ టైప్ ఎదురుగా సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ సినీ నటుల అభిమానులు అంటే కేవలం తమ హీరో పట్ల అభిమానానికి మాత్రమే పరిమితం కాకుండా వారి పుట్టినరోజులు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ప్రశంసలు అందుకోవటమే కాకుండా తమ అభిమానం నాయకునికి మరింత దగ్గరవుతూ ఉండటం వారు కూడా గర్వపడే విధంగా చక్కని సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అభినందించారు రక్తదానం అంటే మరొకరికి ప్రాణదానం చేయటమేనని అన్నారు వ్యయ ప్రయాసలకోర్చి చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహేష్ బాబు ఫ్యాన్సును అందరూ ప్రోత్సహిస్తూ అభినందించారు అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెంకట్ రెడ్డి మేన్స్ అధినేత వెంకట నాగేశ్వరావు, బాలాజీ స్వీట్ అధినేత రంగారావు , ఎస్ వి నాయుడు, కుడిపూడి శ్రీనివాసరావు ,జానపాటి వేణు , మహేష్ బాబు ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు గోపి . అధ్యక్షులు ప్రదీప్ , ఉపాధ్యక్షులు సర్వేష్ , కాజా, వినయ్,సురేష్,ఆదిత్య, రవి, నిశాంత్, పగిడిపల్లి వెంకటేష్, వర్షిత్, సాత్విక్, పవన్, ప్రవీణ్, ముత్యాలు, రవీందర్, కాజా,సాయి, తదితరులు పాల్గొన్నారు.