గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని… తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి.ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని.. ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ, కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.
Post Views: 114