గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగోల్డెన్ స్వయం సహాయక సంఘాల (SHGs) ఆర్థిక సాధికారత కోసం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు.. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రకటించారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించినది. ఈ పథకం కింద.. 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, ఇందులో 1,000 మెగావాట్లు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతాయి.
Post Views: 118