ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు..

ఆదివాసి జెండాను ఆవిష్కరించిన  రేగా.

మండల కేంద్రంలో భారీ ర్యాలీ..

ఆకట్టుకున్న ఆదివాసి సాంస్కృతి సంప్రదాయాలు..

భారీగా తరలి వచ్చిన ఆదివాసిలు..

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా కరకగూడెం మండలంలో ఆదివాసి సంఘాలు ఆదివాసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు. ముఖ్యఅతిథిగా పాల్గొని కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు, కరకగూడెం మండల పరిధిలో 16 గ్రామ పంచాయతీల నుంచి ఆదివాసీలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆదివాసి దినోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేశారు. సీతారాంపురం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద ప్రధాన రహదారి నుంచి ఆదివాసి జేఏసీ మండల అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, కార్యదర్శి కలం సాంబమూర్తి చందా రామకృష్ణ కాలం సంపత్ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలు డీజే పాటలు కొమ్ము డాన్సులతో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నృత్యాలు చేస్తూ కరకగూడెం ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, సుమారు మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి బట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వీరాపురం క్రాస్ వద్ద కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ జాతి కోసం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొమరం భీం విగ్రహం వద్ద ఆదివాసి నినాదాలతో మారు మ్రోగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆదివాసి అస్తిత్వాన్ని రక్షించడం కోసం నిజాం పాలకులతో పోరాడి ఆదివాసి జాతి ధైర్యాన్ని నిలిపిన మహా నీయుడు కొమరం భీముడని వారన్నారు. మహనీయుని ఆశయాలకు ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రతీ ఆదివాసి బిడ్డ కదం తొక్కాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలలో కొత్తూరు గ్రామస్తులు చిన్న పిల్లల వేషదారణ ప్రదర్శించిన నృత్య ప్రదర్శన చూపరులను తుమ్మలగూడెం యువత కూడా ఆకట్టుకుంది. ఆదివాసి జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన రుచికరమైన ఆహారాన్ని భుజించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి జేఏసీ నాయకులు మండల ప్రజా ప్రతినిధులు మాజీ సర్పంచులు, గ్రామ శాఖ నాయకులు గ్రామ పెద్దలు, గ్రామ పటేళ్లు, యువజన నాయకులు యూత్ సభ్యులు కలం వేణు గోపాల్, పోలేబోయినా ప్రేమ్ కుమార్, సుతారి నగేష్, పోలేబోయినా శ్యామ్ ప్రసాద్, తోలేం హరి కృష్ణ మలకం నరేష్, ఉకే నరేష్ ఇర్ప నాగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram