నాలుగేళ్ల తమ్ముడికి ప్రాణం పోసిన అక్క.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడికి అండగా నిలిచిందో అక్క. అపోహలను పక్కన పెట్టి.. తన మూల కణాలను దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడు అప్లాస్టిక్ అనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మూలకణాలను మార్చాలని వైద్యులు సూచించారు. అందుకు ఇంటర్ చదువుతున్న అతడి సోదరి ముందుకొచ్చింది. తమ్ముడికి ధైర్యం చెప్పి, తన శరీరంలోని మూలకణాలను దానం చేసి, అతడి ప్రాణాలు రక్షించింది. మానవ సంబంధాలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో.. బంధం అంటే ఇలా ఉండాలని రుజువు చేసింది. నేడు రాఖీ పండగ సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో తమ్ముడికి రాఖీ కట్టి.. ‘ నీ కోసం నేనున్నా తమ్ముడూ’ అంటూ ధైర్యం చెప్పింది. సందర్భంగా వైద్యుడు నరేందర్ కుమార్ మాట్లాడుతూ.. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ఇది నిదర్శనమని అన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram