గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బీసీ రిజర్వేషన్ అంశం ఇంకా తేలకపోయినా, హైకోర్టు విధించిన గడువు మేరకు ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్
రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్తులు, 12,778 పంచాయతీలు, 1,12,934 వార్డులు ఖరారు
ముందుగా పరిషత్ ఎన్నికలతో మొదలు పెట్టే ప్రణాళిక పంచాయతీ రాజ్ శాఖ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు
రిజర్వేషన్ చిక్కు
బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి
2019లో ఉన్నట్లే 23% రిజర్వేషన్లతోనే ముందుకు
పార్టీపరంగా బీసీలకు జనరల్ సీట్లలో కూడా పోటీ అవకాశం
చట్టపరమైన అడ్డంకులు
42% బీసీ రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్
ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లేదు
హైకోర్టు గడువు సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయకపోతే గడువు పొడిగింపు కోసం అడగనుంది
ఎన్నికల కమిషన్ సన్నాహాలు
కలెక్టర్లకు సిబ్బంది జాబితా సిద్ధం చేయమని ఆదేశాలు
రిజర్వేషన్ల జాబితా రాగానే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నద్ధం.