నేడు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం / తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి కృషితో మధిర మండలం వంగవీడు గ్రామ వద్ద వైరా నదిపై 600 కోట్ల రూపాయలతో మంజూరైన జవహర్‌ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు (ఆదివారం) నాడు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ,సాగునీటిపారుదల మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,రోడ్డుభవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఖమ్మం ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి , రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు , ఆరుగురు(6) మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ  పార్టీ అభిమానులు ప్రజలు నాయకులు ఈ సభలో పాల్గొని గ్రామ అభివృద్ధికి తోడబడాల్సిందిగా పేరుపేరునా మనవి.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ‌భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆయిలూరి.సత్యనారాయణ రెడ్డి ప్రకటనలో తెలియజేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram