అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల డిమాండ్.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు / పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు వెంటనే ఆపాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపందా) ఆధ్వర్యంలో మణుగూరు లోని మౌనిక రెస్టారెంట్ పైన హాల్లో పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ జరిగిన అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలస్తీనా పై ఇజ్రాయిల్ అమానుషంగా దాడులు చేస్తూ, మారణ హోమం సృష్టిస్తూ, పాలస్తీనీయుల జాతి హననానికి పూనుకున్నదని, దానిలో భాగంగానే పిల్లలు, వృద్దులు, మహిళలు అనే తేడా లేకుండా సామాన్య ప్రజలను విచక్షణారహితంగా చంపుతూ, ఆహారం, మందులు అందకుండా చేసి అమానుషంగా ప్రవర్తిస్తుందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. తమ జాతి రక్షణ కోసం, తమ దేశ రక్షణ కోసం పోరాడుతున్న పాలస్తీనాకు సంఘీభావం తెలపాలన్నారు. పాలస్తీనీయుల జాతి హననాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని, అమెరికా భారత్ పై సుంకాలు విధించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై మణుగూరులో ఒక ర్యాలీ చేయాలని ఆలోచన చేయడం జరిగిందని, ఇందుకోసం రేపు అనగా 11. 8. 2025 సాయంత్రం నాలుగు గంటలకు మణుగూరులో స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అన్నిపార్టీలు, ప్రజాసంఘాల తోటి విస్తృతస్థాయి సమావేశ0 జరిపి నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయించడం జరిగిందన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్(ప్రజాపందా) నాయకులు ఆర్. మధుసూదన్ రెడ్డి,బి ఆర్ ఎస్ నాయకులు కుంట.లక్ష్మణ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాగర్ అన్న, సిపిఐ నాయకులు గడ్డం. వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు వట్టం. నారాయణ, వాసిరెడ్డి చలపతిరావు, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) నాయకులు మల్లెల. రామయ్య, పి. సంజీవరెడ్డి, ఐ ఎఫ్ టి యు నాయకులు ఎం.నాగేశ్వరరావు, పి. నాగర్జున, మణుగూరు మండల ముస్లిం మిల్లత్ కమిటీ నాయకులు ఎండి. సిరాజ్ పాషా, ఎండి. బాబా, జమాతే ఇస్లామిక్ హింద్ నాయకులు ఎండి రఫీ, ప్రజాస్వామిక వాది సాగర్ తదితరులు పాల్గొన్నారు.