సంగారెడ్డి జిల్లాలో దారుణం 

అంబులెన్స్ వెళ్లడానికి దారి లేక గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు 

గోల్డెన్ న్యూస్ / సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్‌కి సరైన దారి లేకపోవడంతో గర్భిణీ మహిళను కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లడం బాధాకరంగా నిలిచింది. ఈ ఘటన నాగిల్ గిద్ద మండలం మున్యా నాయక్ తండా లో చోటుచేసుకుంది. ఆసుపత్రికి చేరుకోవాల్సిన గర్భిణీ స్త్రీకు ఎటువంటి సదుపాయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు 2 కిలోమీటర్ల దూరం ఆమెను భుజాలపై మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆడబిడ్డకు మార్గమధ్యలోనే జన్మనిచ్చిన సంఘటన ఈ ఘటనను మరింత విషాదాత్మకంగా చేసింది.ఈ గర్భిణీ స్త్రీ కు ఆపదలో సహాయం చేయడానికి ఆ ప్రాంత ఆశా వర్కర్లు కూడా ముందుకు వచ్చారు. వారికి సహాయపడుతూ వెంటనే ఆడబిడ్డకు జన్మ ఇచ్చిన మహిళను అంబులెన్స్‌ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram