ముంపు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన

గోల్డెన్ న్యూస్  /హైదరాబాద్: గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాలైన అమీర్ పేట్ బుద్ధ నగర్, మైత్రి వనం, బాల్కంపేట ఏరియాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బుద్ధనగర్ లో డ్రైనేజీ సిస్టంను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కాలనీ “పై కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తు ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే డ్రైనేజీ సిస్టంను స్ట్రీమ్ లైన్ చేసి, వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాలని అధికారులకు సూచించారు.

వరద ముప్పు తొలగేలా ప్రణాళికలు..

పక్కనే ఉన్న గంగూబాయి బస్తీ కుంటను కొంతమంది పూడ్చి వేసి పార్కింగ్ కు వినియోగిస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కలిసి గంగూబాయి కుంట సూచనలు చేశారు. ఒక ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వరద ముప్పు తొలగేలా ఈ ప్రాంతాలకు సంబంధించి వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇటీవల వరద నీరు నిలిచిపోయిన మైత్రీవనం వద్ద పరిస్థితిని హైడ్రా అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించాు. స్థానికులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram