టీడీపీ వినూత్న ఎన్నికల ప్రచారం.

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉత్కంఠ

ఖైదీల వేషధారణలో వీధుల్లోకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు

“బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా?” అంటూ నినాదాలు

డప్పు వాయిద్యాలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న టీడీపీ శ్రేణులు

ఈ నెల 12న జరగనున్న పోలింగ్ కోసం జోరుగా ప్రచారం

గోల్డెన్ న్యూస్ /ఆంధ్రప్రదేశ్ : పులివెందులలో జరగనున్న జడ్పీటీసీ ఉపఎన్నికల వేడి మామూలుగా లేదు. జరగుతున్నది జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా, అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నంత తీవ్ర వాతావరణణం నెలకొంది. ప్రచార పర్వంలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా ముందుకుపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఖైదీల వేషాలు ధరించి, డప్పులు వాయిస్తూ వీధుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

ఈ నెల 12వ తేదీన జరగనున్న జడ్పీటీసీ స్థానానికి సంబంధించిన ఉపఎన్నికల పోలింగ్ కోసం ఈ ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా, “బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్ కు ఓటు వేద్దామా?” అనే నినాదాన్ని టీడీపీ తమ ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది. పులివెందులలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఈ ప్రత్యేకమైన వేషధారణలో డప్పు వాయిద్యాల మధ్య నినాదాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ ప్రచార సరళి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖైదీల దుస్తుల్లో ఉన్న కార్యకర్తలు డప్పులు కొడుతూ ముందుకు సాగుతుండగా, మరికొందరు ఈ నినాదాన్ని గట్టిగా నినదిస్తున్నారు. ఈ వినూత్న ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram