రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్..!

ఓట్ల చోరీ వ్యవహారంలో విపక్షాల ఉద్యమంతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా పలువురు ఎంపీలు నినాదాలు చేస్తూ సంసద్ మార్గ్ ధర్నాకు దిగారు. దీంతో రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా.. విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తున్న విపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు.. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram