అవసరానికి అప్పు ఇచ్చి ఆదుకోవడమే అతనికి శాపమైంది.
గోల్డెన్ న్యూస్ /కరీంనగర్. : ఇచ్చిన అప్పు తీర్చమని అడిగితే తిరిగి వారి నుంచే వేధింపులు అధికమవడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న అతను క్రిమిసంహారక మందు తాగి మృతి చెందిన ఘటన ఇది.
కరీంనగర్‌కు చెందిన కామారపు అనిల్ (36) సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు గతంలో తన ఫ్రెండ్స్‌కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు.
ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అడుగగా… వారు ఇవ్వకపోగా, అనిల్ ను వేధించడం మొదలు పెట్టారు.
దీంతో మనస్తాపానికి గురై గత నెల 31న తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో పురుగుల మందు సేవించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందుతూ ఆదివారం మృతి చెందాడు.
Post Views: 59