గోల్డెన్ న్యూస్/ కరకగూడెం :సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఐ టి సి సంస్థ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. సోమవారం మండల పరిధిలోని భట్టుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఐ టి సి సంస్థ ఆధ్వర్యంలోస పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా 9 మంది విద్యార్థులకు 9 సైకిళ్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. పేద విద్యార్థులకు ఐటీసీ సంస్థ సైకిల్ పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంజుల, భట్టుపల్లి ప్రధానోపాధ్యాయులు మోహన్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 263