గోల్డెన్ న్యూస్ / పినపాక : పినపాక నియోజకవర్గం పినపాక మండలంలోని తోగ్గూడెం, పినపాక, ఉప్పాక గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పంచాయతీరాజ్ నిధుల నుండి ఈ రహదారులు నిర్మించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో మిగిలిన రహదారులను కూడా త్వరగతిలోని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
Post Views: 127