వీధి కుక్కల దాడితో ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మృతి.
అక్టోబర్ 15న మార్నింగ్ వాక్కు వెళ్లిన పరాగ్ దేశాయ్ను వీధి కుక్కలు వెంబడించాయి. ఆపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా, అహ్మదాబాద్లోని జైదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం వల్ల కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆస్పత్రిలో మరణించినట్లు వాఘ్ బక్ర్ టీ గ్రూప్ కంపెనీ వెల్లడించింది. పరాగ్ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
(వాగ్ బక్రి టీ పౌడర్ యజమాని) పరాగ్ దేశాయ్, ₹2,000 కోట్ల విలువైన ఆస్తుల యజమాని మరియు 60 దేశాలలో వ్యాపారాన్ని విస్తరించి ఉన్నాడు. 7 రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన పరాగ్ దేశాయి ( 49 సంవత్సరాల) వయస్సులో విచారకరంగా మరణించాడు. దయచేసి వీధికుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేయండి. నిజంగా విషాదకరమైన మరియు హృదయ విదారకమైన సంఘటన. ప్రతి ఒక్కరూ చదవాలి మరియు అప్రమత్తంగా ఉండాలి – వీధికుక్కల నుండి మిమ్మల్ని మరియు ఇతరులను రక్షించుకోండి.