ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్‌ కాన్సట్రేటర్ వితరణ

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మంగళవారం అందజేశారు. ఆధార్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తోలెం రమేష్ చేతుల మీదుగా పి హెచ్ సి వైద్యులు  రవితేజ, పోలేబోయిన క్రిష్ణయ్య, సిబ్బందికు అందజేశారు. అనంతరం ఆధార్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తోలెం రమేష్ మాట్లాడుతూ.. ఈ కాన్సంట్రేటర్ విలువ 25 వేలు ఉంటుందని , పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అందిస్తున్నట్లుగా తెలియజేశారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచేందుకు ఈ పరికరాలను అందజేస్తున్నట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram