వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండొద్దు: సుప్రీం కోర్టు ఆదేశాలు

దిల్లీ,ఎన్సీఆర్ లలోని వీధి కుక్కల ను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ  చేసింది. వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు  పెరుగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.

దేశంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందించి, ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారణను చేట్టింది. అయితే ఈ విషయంపై కేంద్ర నుంచి మాత్రమే వాదనలు వింటామని జంతు ప్రేమికులు లేదా మరే ఇతర పార్టీ నుంచి వచ్చిన పిటిషన్లనపై విచారించలేమని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేశామని ధర్మాసం పేర్కొంది.

వారి ప్రాణాలను తిరిగి తీసుకువస్తారా?’

వీధికుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్దివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు. అయితే, జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడం వల్ల అది నిలిచిపోయిందని వివరించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం రేబిస్తో చనిపోయిన వారని జంతు ప్రేమికులందరూ కలిసి తిరిగి తీసుకురాగలుతారా? అంటూ ప్రశ్నించింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని అన్నారు. కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కులను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించబోమని కూడా పేర్కొంది. కుక్క కాటు కేసులను నివేదించడానికి వారంలోపు ఒక హెల్ప్ లైన్ లను ప్రారంభించాలని పౌర అధికారులకు సూచించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram