గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం వచ్చింది. పట్టుపల్లి గ్రామంలో గవిని సతీష్ ఇంట్లో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. భయంతో కొందరు పరుగులు తీశారు.
Post Views: 42