ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి

గోల్డెన్ న్యూస్/ అశ్వరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం మంజూరు పత్రాలు కూడా అందచేస్తోంది.

 

ఈ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకునే వారికి విడతల వారీగా రూ.5 లక్షల సాయం అందనుంది. అయితే లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరిగాయని చాలా గ్రామాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆందోళనలు కూడా చేపడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త మామిళ్ళవారిగూడెం గ్రామంలో  జేడి మోహనరావు అనే వ్యక్తి  ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక ఎక్కి నిరసన తెలిపారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram