గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి గ్రామంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు బుధవారం కరకగూడెం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 1 ఆటో 2 సెల్ఫోన్లతోపాటు రూ.3 వేలు నగదు స్వాధీనం చూసుకొని ఆరుగురు కేసు నమోదు చేసినట్లు కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు తెలిపారు .పేకాట, కోడి పందేలు వంటి జూద క్రీడలు ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
Post Views: 668