ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది పరేడ్ నిర్వహించారు. వేడుకల సందర్భంగా తెలంగాణ జానపద, నృత్య రీతులు కళా రూపాలను ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు మెడల్స్ ను ముఖ్యమంత్రి పోలీసు అధికారులకు ప్రదానం చేశారు.
Post Views: 131









