జీఎస్టీలో మార్పులు. వస్తువుల ధరలు దిగి వచ్చే అవకాశం

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక సవరణలకు కేంద్రం సిద్ధమైంది. సామాన్యులు, చిరువ్యాపారులపై భారం తగ్గించేలా.. ఇకపై జీఎస్టీ (జిఎస్టి)లో రెండు శ్లాబ్‌ల (5, 18 శాతం) విధానాన్ని ప్రతిపాదించింది. సామాన్యులు, 12, 28 శాతం శ్లాబ్లకు స్వస్తి పలకనుంది. దీపావళి కానుకగా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అనేక వస్తువుల ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది. మరి అవేంటో ఓసారి చూద్దాం..!

సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదిస్తే, ప్రస్తుతం 12% శ్లాబ్లో ఉన్న 99% వస్తువులు.. 5% పన్ను శ్రేణిలోకి వెళ్లనున్నాయి. అదే విధంగా ప్రస్తుతం 28% పన్ను శ్లాబులో ఉన్న వస్తు సేవల్లో 90%.. 18% పన్ను రేటుకు మారనున్నాయి. ఈ కొత్త విధానంతో జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు లాభం చేకూరనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram