గోల్డెన్ న్యూస్/ ఖమ్మం : బండి మోజులో పడి ఓ యువకుడు కుటుంబ బంధాలు, ఆత్మీయతలు, నమ్మకాలు పక్కన పెట్టి మూర్ఖుడు మారడు. బండి కొనివ్వలేదని కన్నవాళ్లనే నరికే వరకు వచ్చాడు. అంతేకాదు నచ్చిన బైక్ కొని ఇవ్వకపోతే ఏకంగా కాటికే సాగనంపాలని నిర్ణయించుకున్నాడు. కొడుకుగా తల్లిదండ్రులపై ప్రేమ, అనురాగంగా ఉండాల్సింది పోయి గొడ్డలితో దాడి చేసి సభ్య సమాజం తల దించుకునేలా చేశాడు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత విద్వేషాలతో బంధాలు, మానవ సంబంధాలు తెగిపోతుంటే.. తాజాగా కన్న తండ్రిని కొడుకే నరికిన దారుణమైన సంఘటన తెలంగాణలో కలకలం రేపింది.ఖమ్మం జిల్లా మంగళిగూడెంలో పల్సర్ బైక్ కొనివ్వలేదన్న కోపంతో కన్న కొడుకే తండ్రిపై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో నాగయ్య తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









