ఉప రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సీ.పీ.రాధాకృష్ణన్ పేరును ఎన్ డీ ఏ ఖరారు చేసింది. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని బలపరుస్తామని ఎన్ డీ ఏ పక్షాలు ఇదివరకే ప్రకటించాయి. ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీసీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్నారు.
Post Views: 35









