నీల్వాయి ఎస్సై పై సస్పెన్షన్ వేటు !

గోల్డెన్ న్యూస్/ మంచిర్యాల :  జిల్లాలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకున్న ఆయన, బాధితుడిని లంచం కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచం ఇవ్వలేదనే కారణంతో బాధితుడిని చితకబాదినట్టు తెలుస్తోంది.

బాధితుడు అల్లాను కిష్టయ్య  ఫిర్యాదు ఆధారంగా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు దర్యాప్తు జరిపి, ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఎస్సై సురేష్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

నెలరోజుల క్రితమే నీల్వాయి పోలీస్ స్టేషన్‌కి బదిలీ అయిన సురేష్, వివిధ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు పలువురిని చితకబాదినట్లు ఆరోపణలు  తెలుపుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram