గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో నడువాలని మండల గౌడ సంఘం నాయకులు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ఆయన 375వ జయంతిని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మండల గౌడసంఘం నాయకులు మాట్లాడుతూ ..నాటి రాజులపై తిరుగుబాటు చేసి బహుజనులకు అండగా నిలబడి పోరాట పటిమతో గెలిచినట్లు పేర్కొన్నారు. ఆయన ఆశయ పాధన కోసం పని చేస్తూ ఆశయాలను నెరవేర్చ డానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
Post Views: 306









