ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం :  ప్రపంచ ఫోటో గ్రఫీ  దినోత్సవాన్ని పురస్కరించుకొని 186 వ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఫోటోగ్రాఫర్లు మంగళవారం కరకగూడెం మండలంలో ఘనంగా నిర్వహించారు. పినపాక, కరకగూడెం మండలాల ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సిరిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కీసర సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సారయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కరకగూడెం మండలంలో ఫోటో గ్రాఫర్ ల ఐక్యతను చాటుతూ ఫోటో గ్రాఫర్ లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతం కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కీసర సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాకుండా సమాజాన్ని మలచగల శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. “ఒక ఫోటో వెయ్యి పదాలకు సమానం” అనే నానుడిని గుర్తుచేస్తూ, చరిత్రను సజీవంగా నిలుపడంలో ఫోటోగ్రఫీ అపారమైన పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తేవడంలో, సాంస్కృతిక సంపదను తరతరాలకు అందించడంలో ఫోటోగ్రఫీ ప్రాధాన్యం ఎంతగానో ఉందని విశదీకరించారు. అదేవిధంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గుమ్మడి వెల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వాగబోయిన సాంబశివరావు, కోశాధికారి, గాంధర్ల సతీష్, ఫోటో గ్రాఫర్ లు గుండు వెంకట నారాయణ, రంజిత్, సుధాకర్, విష్ణు, రాజేందర్, సాయి, వెంకట్,దిలీప్, మోహంత్, రెండు మండలాల ఫోటో గ్రాఫర్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram