ఆశా వర్కర్లకు ప్రతీ నెలా వేతనాలు పెండింగ్ లేకుండా చెల్లించాలి

కనీస వేతనం 18000 ఇవ్వాలి

 సమస్యలతో కూడిన వినతీ పత్రం అందజేసిన -సిఐటియు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ఆశా వర్కర్లకు ప్రతీ నెలా వేతనాలు పెండింగ్ లేకుండా నెలవారి సక్రమంగా ఇవ్వాలని కనీస వేతనం 18000 అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పీహెచ్సీ వైద్యాధికారి రవితేజ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీఐటీయూ నాయకులు కొమరం కాంతారావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలకు తెగించి కరోనా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఆశా వర్కర్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కరించకుండా నెలల తరబడి పారితోషకాలు పెండింగ్లో ఉన్నాయని పారితోషికం కాదు గౌరవ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, ఎఎన్ఏం, జీఎన్ఏం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు ఏఎన్ఎం, జిఎన్ఎమ్ లలో ప్రమోషన్స్ కల్పించాలి లేదా రిక్రూట్మెంట్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం, ఆదివారం సెలవు, పండగ సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు వట్టం సమ్మక్క,పొలెబొయిన సరిత,పద్మ, వెంకటలక్ష్మి,లలిత, తిరుపతమ్మ,తదితర ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram