గోల్డెన్ న్యూస్ / రంగారెడ్డి : తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించాలనగా, అందుకు ప్రతిగా ₹15,000 లంచం కోరిన రమేష్‌ను, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే ACB అధికారులు పట్టుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తరచూ లంచగొండితనాన్ని అరికట్టేందుకు ప్రజలకు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.
Post Views: 53









