గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / తెలంగాణాలో జరిగే అతి పెద్ద అడవి బిడ్డల జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహా జాతర కోసం ఇప్పటి నుంచే ప్రభుత్వం ఏర్పాటు షురూ చేసింది. తెలంగాణ కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు చేసింది. వచ్చే సంవత్సరం 2026 జనవరి 28వ తేదీన మేడారం జాతర ప్రారంభం కానుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహా జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌లకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క.
Post Views: 21









