బాలికపై ఆటో డ్రైవర్ల ఘాతుకం

కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి బాలికపై అత్యాచారం

  ♦ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులు

ఎన్ని చట్టాలు తెచ్చిన ఒక ఆడపిల్లకు ఇంకా రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా బయట కనపడితే చాలు కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఎన్ని చట్టాలు తెచ్చిన ఒక ఆడపిల్లకు ఇంకా రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా బయట కనపడితే చాలు కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అజాగా భద్రాచలం ఏజెన్సీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. బాలికను ఆటోలో తీసుకెళ్లి డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితురాలిని ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన ఆదివాసీ బాలికగా గుర్తించారు. బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం ఆమె చర్ల మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడి నుంచి వాజేడు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటోలోని ఇతర డ్రైవర్లు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. ఆమె శరీరంపై పంటిగాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ స్టేషన్ల పరిధిలోని పోలీసు బృందాలను ఎస్పీ రోహిత్ రాజు రంగంలోకి దించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram