ఇకపై ఈ సేవలకు ఆధార్ అవసరం లేదు!

దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న వేళ, కార్మిక మంత్రిత్వ శాఖ తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram