గోల్డెన్ న్యూస్ / మణుగూరు : ఈనెల 13. 8. 2025వ తేదీన రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో మణుగూరుకు చెందిన మహమ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి తన యొక్క TS 28 J 8256 అనే నెంబర్ గల Mahindra Bolero Neo కారును ఆదర్శనగర్ నందు పార్కు చేయగా అట్టి Mahindra Bolero Neo కారును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మహమ్మద్ ఫిరోజ్ ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.అట్టి కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు( ఆదివారం) అట్టి Mahindra Bolero Neo కారును దొంగతనం చేసిన మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ కి చెందిన షేక్ కరంతుల్ల, మణుగూరు లోని చెరువు ముందు సింగారం కు చెందిన నాజీరు ను పట్టుకొని వారి వద్ద నుండి Mahindra Bolero Neo కారును స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించినట్లు మణుగూరుు చేయి నాగబాబు తెలిపారు.
ఇరువురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి అప్పులు చేసి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనానికి పాల్పడటం జరిగిందని వారు పేర్కొన్నారు.









