పత్తి మొక్కలను పీకేసిన ఫారెస్ట్ అధికారులు: పోలీసులకు ఫిర్యాదు చేయనున్న బాధితులు

గోల్డెన్ న్యూస్ బూర్గంపాడు: ఫారెస్ట్ ల్యాండ్లో సాగు చేశారనే కారణంతో పూతకొచ్చిన పత్తి మొక్కలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివారం రాత్రి పీకేశారని బూర్గంపాడు మండలం గోపాలపురం గ్రామం సర్ప సత్యనారాయణ సర్ప సరస్వతి దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గోపాలపురం శివారులో లక్ష్మీపురం గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందిన రెండు ఎకరాల పోడు భూమిలో గోపాలపురం గ్రామానికి చెందిన సర్ప సత్యనారాయణ సర్ప సరస్వతి దంపతులు కౌలుకు తీసుకుని రెండు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. పత్తి పంట ఎదిగి పూత దశకు వచ్చింది అయితే శుక్రవారం అటవీ శాఖ అధికారులు కొంతమంది వచ్చి పూత దశలో ఉన్న పత్తి పట్టణం పీకేశారు. ఈ విషయంపై బాధిత రైతు అటవీ శాఖ అధికారులను అడుగగా వేరే వాళ్లది అనుకొని పొరపాటున పీకేశారు మీకు న్యాయం న్యాయం చేస్తామని చెప్పినట్లు బాధిత రైతు తెలిపారు. కానీ నేటి వరకు ఆ రైతుకు న్యాయం జరగలేదని ఈ రోజు (సోమవారం) సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయను చేయనున్నట్లు వారు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్నప్పటికీ ఇది ఫారెస్ట్ భూమి అని అధికారులు పూత దశలో ఉన్న పత్తి మొక్కలను ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

బాధిత కుటుంబాన్ని  పామర్శించిన సిపిఎం పార్టీ  బృందం

బాధిత కుటుంబాన్ని సందర్శించి పత్తి పరిశీలన చేసి సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..

ఫారెస్ట్ అధికారులపై తగిన చర్య తీసుకోవాలని వారికి నష్టపరిహారం ఎకరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు గుంటక కృష్ణ ,నిమ్మల అప్పారావు, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram