భర్త కాదు కాలయముడు .!

భార్యకు తిండి పెట్టకుండా విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు భార్యకు తిండి పెట్టకుండా.. విగత జీవిలా మార్చి హతమార్చాడు. పూర్తి వివరాల్లోకి  వెళ్లితే.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా, మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్న దంపతులు

శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన నరేష్ బాబు

ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి, దీనస్థితిలో ఉన్న లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూసి షాకైన తల్లిదండ్రులు

శరీరమంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు

రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీప్రసన్నను హతమార్చారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.

Facebook
WhatsApp
Twitter
Telegram