డ్రగ్స్ పార్టీపై పోలీసుల రైడ్ : ఆరుగురు నిందితుల అరెస్ట్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ : గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ జరుగుతుందన్న సమచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఒక పార్టీలో డ్రగ్స్‌ వాడుతున్నట్లు తెలియడంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా నుంచి వచ్చిన నీలిమ, రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్‌, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మల్నాడు డ్రగ్స్‌ కేసు నిందితుడు కావడం గమనార్హం. కాగా, వారి నుంచి 20 గ్రాముల కొకైన్‌, నాలుగు గ్రాములు ఎండీఎంఏ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram