తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు అతలాకుతలమయ్యాయి.ప్రధానంగా కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. నిర్మల్, ఆదిలాబాద్, కుమురం భీం, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లోనూ రహదారులు పాడయ్యాయి. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి 794 ప్రాంతాల్లో 1,039 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 305 ప్రాంతాల్లో రోడ్లపై నకు అంతరాయం కలిగింది.

1039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నట్టు గుర్తింపు,31 చోట్ల తెగిపడ్డ రహదారులు,10 చోట్ల తాత్కాలికంగా రోడ్ల పునరుద్ధరణ ,తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.53.76 కోట్ల ఖర్చు శాశ్వత పునరుద్ధరణ పనులకు..

రూ.1157.46 కోట్లు అవసరమని ఆర్‌అండ్‌ అధికారుల అంచనా

Facebook
WhatsApp
Twitter
Telegram