గోల్డెన్ న్యూస్ /తల్లాడ :
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పట్టణాలు పల్లెలు వరదలతో నీట మునిగి అతలాకుద్రమవుతున్నవి. ఈ నేపథ్యంలో తల్లాడ మండలంలోని బిల్లుపాడు-కొత్తవెంకటగిరి, బిల్లుపాడు-రామచంద్రాపురం గ్రామాల మధ్య ఉన్న మాచవరం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవెంకటగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి అవసరమైన పూలదండ, సామగ్రితో పాటు గ్రామంలోని ఒకరికి బీపీ మందులను బిల్లుపాడు నుంచి కొత్తవెంకటగిరి గ్రామస్థులు డ్రోన్ తో అందజేశారు.
Post Views: 36









