మీసేవ భవనం పరిస్థితి దారుణంగా ఉంది.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రభుత్వం నిర్మించిన మీ సేవ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. గోడలు బీటలు విరిగి, పైకప్పులు ఊడిపడి, ఇనుపరాడ్లు కనిపిస్తున్నవి . ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయపడుతున్నారు గతంలో ఇదే భవనంలో ఒక ఉద్యోగి పైకప్పు ముక్కలు ఊడిపడటంతో తలకు గాయమై ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. ఆ సంఘటన తర్వాత కూడా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడు ఎం ప్రమాదం జరుగుతుందో తెలియని స్థితిలో ఉద్యోగులు ప్రతిరోజూ భయంతో పనిచేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం కానీ ప్రాణాలు సురక్షితం కాని పరిస్థితి లో ఉన్నాం అని ఉద్యోగులు వాపోతున్నారు. విద్యుత్ వైర్లు బహిరంగంగా వేలాడుతూ ఉండటం, వర్షాకాలంలో గోడల మీద తేమ పెరిగి గదులు చిత్తడిగా మారిపోవడం, దోమలు, పురుగులు పెరిగిపోవడం ఆ భవనం ప్రమాదకరంగా మారిందని ప్రజల ఆవేదన వేక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ భవనం ఇలా ప్రమాదకరంగా ఉండటం విచారకరం అని స్థానికులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఉద్యోగులు, ప్రజల ప్రాణాలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని. నిత్యం రద్దీగా ఉండే ఈ భవనాన్ని ఉన్నత అధికారులు వెంటనే స్పందించి భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. లేదా కొత్త భవనం నిర్మించాలి. ఈ ఉద్యోగులు, ప్రజలు భద్రతతో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలి అని మణుగూరు ప్రజలు కోరుతున్నారు. 










