టేకు కలప పట్టివేత.

గోల్డెన్ న్యూస్ /ములుగు : వెంకటాపురం మండల పరిధి  రామచంద్ర పురం గ్రామం సమీపంలో అక్రమ టేకు, కలపను అటవీ శాఖ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. 20 టేకు దిమ్మలను స్మగ్లర్లు ఐచర్ ఐచర్ వ్యానులు తరలిస్తుండగా సమాచారం అందుకున్న అధికారులు దాడులు చేసి కలపను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న టేకు దిమ్మలు, వాహనాన్ని వెంకటాపురం ఫారెస్ట్ కార్యాలయానికి తరలిం చారు. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ధ్వాలియా తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఈ దాడిలో రామచంద్రపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వంటకాల శ్రీనివాసరావు, వెంకటాపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవా, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ దాస్, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram