గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మాదన్న గుంపు వలస ఆదివాసీ కాలనీలో నాలుగు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదు. విషయం తెలుసుకున్న సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు గ్రామంలో పర్యటించి సంబంధిత అధికారులను కలిసి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఆయన విజ్ఞప్తి మేరకు స్పందించిన అధికారులు వీధిలైట్ లోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై గ్రామ ప్రజలు సిపిఎం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 35









