ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

రేపు జరగబోయే ముఖ్యమంత్రి గారి పర్యటనకు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు.

అధికారులు మరియు సిబ్బంది తమకు కేటాయించిన విధులను భాద్యతతో సక్రమంగా నిర్వర్తించాలి.

ముఖ్యమంత్రి  పర్యటనలో భాగంగా బందోబస్తుకు విచ్చేసిన అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసిన ఎస్పీ .

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : రేపు జరగబోయే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ వెల్లడించారు.చంద్రుగొండ మండలంలో రేపు జరగబోయే కార్యక్రమానికి బందోబస్తు విధులు నిర్వర్తించడానికి విచ్చేసిన అధికారులు మరియు సిబ్బందితో చంద్రుగొండలోని లక్ష్య గార్డెన్స్ నందు సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలను చేశారు.సుమారుగా 1200 మంది పోలీసులతో ముఖ్యమంత్రి గారి పర్యటనకు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు,సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలలో బాధ్యతగా విధులు నిర్వర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ముందస్తుగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సమావేశానికి హాజరయ్యే ప్రజలు,ప్రజాప్రతినిధులు పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్బంగా కోరారు.రేపు ఉదయం 10:00 నుండి సాయంత్రం 5 గంటల వరకు VM బంజర నుండి కొత్తగూడెం వైపుకు వెళ్లే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూర్ మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం వైపు వెళ్లాలని సూచించారు.అదేవిధంగా కొత్తగూడెం నుండి VM బంజర వైపు ప్రయాణించే ప్రయాణికులు ఏన్కూర్,తల్లాడ మరియు కల్లూరు మీదుగా వెళ్లాలని తెలిపారు.సామాన్య ప్రజానీకానికి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా పోలీసు వారు చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్ ను పాటించి,వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram