తెలంగాణ కొత్త డీజీపీ ఖరారు..!

సజ్జనార్ బాధ్యతల మార్పు ..?

తెలంగాణ ప్రస్తుత డీజీపీ జితేందర్‌ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరనేదానిపై చర్చ మొదలైంది. కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా డీజీపీ నుంచి కీలక విభాగాల్లో మార్పులు తప్పవని తెలుస్తోంది. కాగా, కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న శివధర్‌ రెడ్డిని నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ను నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డీజీ సీవీ ఆనంద్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా బదిలీ చేసి, ఆయన స్థానంలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేశ్‌ భగవత్‌ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం..

Facebook
WhatsApp
Twitter
Telegram