మృతురాలి కుటుంబానికి బియ్యం,నూనె అందజేత.

గోల్డెన్ న్యూస్ // కరకగూడెం : మండల ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పోలేబోయిన సుశీల  దశదిన కర్మలకుగాను ఆదివాసి జేఏసీ, మరియు దాతల సహాయార్థం 125kg ల బియ్యం, 15kg నూనె ఇవ్వటం జరిగింది. అలాగే తన వంతు సహాయంగా మన మండల రెవిన్యూ భూభారతి ఆపరేటర్ చందా కౌసల్య  6,500 రూపాయలు  తన వంతు సహాయంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం లో జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకట నారాయణ , మాజీ సర్పంచులు పాయం నర్సింహారావు , పోలేబోయిన పాపక్క ,ఆదివాసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, పోలేబోయినా సర్వేశ్వరావు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు పోలేబోయినా ప్రేమ్ కుమార్, కలం సంపత్, ఉకే నరేష్, పోలేబోయిన స్వామి ప్రసాద్, రాజశేఖర్, గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram